పిఠాపురం: సమస్యల పరిష్కారానికై కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

70చూసినవారు
పిఠాపురం: సమస్యల పరిష్కారానికై కూటమి ప్రభుత్వం పని చేస్తుంది
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన వెంట నియోజవర్గ ముఖ్య నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్