పిఠాపురం పట్టణలోని పూర్ణ అన్నపూర్ణ థియేటర్ ప్రాంతంలో శుక్రవారం బొలిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి వద్ద నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బంగారపు చైను, నగదు దొంగలించారు. వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుంచి బంగారం చైను స్వాధీనం పరచుకున్నారు. ముద్దాయిలు గంగాధర్, ఆనంద్లకు రిమాండ్ విధించినట్లు సీఐ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.