పిఠాపురం డ్రైవర్స్ కాలనీ ప్రాంతంలోని కనకదుర్గమ్మతల్లి ఆలయం వద్ద మురికి కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్ఐ మణి కుమార్ తెలిపారు. బుధవారం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు సంఘ టన ప్రాంతానికి వెళ్లి మృత దేహాన్ని బయటకి తీసినట్లు చెప్పారు. అతడి వయస్సు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతుడి శరీరంపై నీలం, తెలుపు చారలు టీషర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు.