పిఠాపురంలోని దక్షిణ కాశీగా పిలవబడే పాదగయలో మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో గురువారం కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అపశృతి లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో మహాశివరాత్రి నిర్వహించేందుకు నిర్ణయించామని ఆర్డీవో తెలిపారు.