కాకినాడ జిల్లా పిఠాపురం రధాల పేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం పరిసర ప్రాంతాల ప్రజలు నుంచి అర్జీలను, వినతులను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.