
పిఠాపురంలో పీజీఆర్ఎస్ లో 198 ఫిర్యాదులు స్వీకరణ
పిఠాపురంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 198 ఫిర్యాదు వచ్చాయని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. సోమవారం పిఠాపురంలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఆక్రమణ తొలగింపు, ఉపాధి కల్పన, సదరన్ సర్టిఫికేట్ వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. కాకినాడ ఆర్డీవో కృష్ణబాబు, డీఎల్డీవో ప్రసాదరావు పాల్గొన్నారు.