రౌతులపూడి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న సునీల్ కుమార్ కు ఉత్తమ అవార్డు వచ్చింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ విశాఖపట్నం రీజనల్ హెడ్ గంగాధర్, పోస్టల్ సూపరింటెండెంట్ శేషారావు చేతుల మీదుగా శనివారం ఈయన ఈ అవార్డును అందుకున్నారు. తపాలా కార్యాలయం ద్వారా ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డులు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ ను గ్రామస్థులు సత్కరించారు.