ప్రత్తిపాడులో పత్తి క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

60చూసినవారు
ప్రత్తిపాడులో పత్తి క్షేత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో పత్తి సాగు క్షేత్రాలను పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ శర్మ, డాక్టర్ దయాకర్ మంగళవారం సందర్శించారు. పత్తిని ఆశించే తెగుళ్లపై రైతులకు పలు సూచనలు చేశారు. మొలక దశ నుంచి సస్యరక్షణ చర్యలు చేపడితే వాటిని నివారించవచ్చన్నారు. గులాబీ పువ్వు తెగులు ఎక్కువగా ఆశిస్తుందని, దిగుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు. రసం పీల్చే పురుగు నివారణపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్