ఏలేశ్వరం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చైల్డ్ ఫోక్సో యాక్ట్ పై అవగాహన కార్యక్రమంను ఎంఈఓ-1 అబ్బాయి, ఎంఈఓ-2 కె. వరలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పాల్గొని మాట్లాడారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు.