ఏలేశ్వరం, పిఠాపురం తదితర ప్రాంతాల నుంచి జగ్గంపేట దూడల సంతకు పెద్ద ఎత్తున అక్రమంగా ఆవులు తరలిస్తున్నారని, జంతుహింస నివారణ సంఘం ప్రతినిధి మోహన్ ఆరోపించారు. ప్రతి సోమవారం జరిగే సంతకు ఆవులను తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కు తమ సంస్థ తరఫున వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అధికారులు గోవుల అక్రమ రవాణా అరికట్టాలని సోమవారం ఆయన కోరారు.