అధికార పక్షాన్ని ఎండగట్టేలా ప్రతిపక్ష వైసీపీ చర్యలు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉభయగోదావరి జిల్లాల వైసీపీ నేతలతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 35 మంది వైసీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు.. పార్లమెంట్ పరిశీలకులు, 5 జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం, గ్రామస్థాయి నుంచి పదవుల భర్తీపైన చర్చించినట్లు తెలుస్తోంది.