ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా శనివారం సాయంత్రం రాజమండ్రి నగరంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదగా కోటిపల్లి బస్టాండ్ వరకు సాగింది. ఈ ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, బలరామకృష్ణ వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.