నల్లజర్ల: తెలికిచర్ల రోడ్డుపై రెండు తలల పాము

51చూసినవారు
నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామంలో శనివారం రాత్రి అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రెండు తలల పాము రోడ్డు మీదకు వచ్చి దాదాపు రెండు గంటల పాటు సంచరించడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన దృశ్యాన్ని పలువురు తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోల రూపంలో బంధించారు. గ్రామస్థులు ఈ పామును చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్