తూ. గో జిల్లాలో కల్లుగీత వృత్తులకు కేటాయించిన 13 మద్యం షాపుల దరఖాస్తులకు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించామని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి చింతాడ లావణ్య గురువారం తెలిపారు. ఇప్పటివరకు 13 మద్యం షాపులకు 17 దరఖాస్తులు మాత్రమే రావడం జరిగిందన్నారు. 9వ తేదీ దరఖాస్తులు పరిశీలన, 10వ తేదీ రాజమండ్రి ఆర్‌డీవో కార్యాలయంలో షాపులు కేటాయింపునకు సంబంధించి డ్రా తీసి అదేరోజు షాపులు కేటాయిస్తామన్నారు.