తూ. గో జిల్లాలో ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన 13 మద్యం షాపులకు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ & ప్రొహిబిషన్ అధికారి చింతాడ లావణ్య సోమవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లా వ్యాప్తంగా 13 షాపులలో జిల్లాకలెక్టర్, బీసీవెల్ఫేర్ ఆఫీసర్, బీసీ కులసంఘాల ప్రతినిధుల సమక్షంలో తీసిన లాటరీలో 11 శెట్టిబలిజ కులానికి, 01 గౌడ కులానికి, 01 గౌడ్ కులానికి కేటాయించడం జరిగిందన్నారు.