రాజమండ్రి: స్టాఫ్ నర్సుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

64చూసినవారు
రాజమండ్రి: స్టాఫ్ నర్సుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
రాజమండ్రి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న పాలియాటివ్ కేర్ యూనిట్లో కాంట్రాక్టు పద్ధతిపై పని చేసేందుకు ఒక జనరల్ ఫిజీషియన్, మూడు స్టాఫ్ నర్స్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఎం & హెచ్ఓ వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్ని సర్టిఫికెట్లను జతపరిచి రాజమహేంద్రవరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో శనివారంలోగా అందజేయాలన్నారు.