రాజమండ్రి: క్యాన్సర్ పై అవగాహన అవసరం: ఎమ్మెల్యే

69చూసినవారు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు చైతన్యవంతులై క్యాన్సర్ ఆరోగ్య సంరక్షణ కోసం ముందుస్తు పరీక్షలు, సత్వర చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్