రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు వాహనదారులకు హెల్మెట్ ధరించాలంటూ గురువారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఆదేశాల మేరకు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో హెల్మెట్ ధారణ ఆవశ్యకత, డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు, జాగ్రత్తల గురించి సీఐ వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అవగాహన కల్పిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.