పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా రాజమహేంద్రవరం నగర ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ ఖర్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన రాజమండ్రిలో శానిటేషన్ నిర్వహణపై పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార సంస్థల నుంచి వచ్చే వ్యర్థాలను ఆయన పరిశీలించి దుకాణదారులకు సూచనలు చేశారు. పలుచోట్ల రహదారుల పక్కన పడవేసిన చెత్తను వ్యాపార సంస్థల చేత ఆయన చెత్త బుట్టలలో వేయించారు.