గీత కార్మికుల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బుధవారం రాజమండ్రిలోని ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో గీత కులాలకు 20 శాతం మద్యం దుకాణాలను కేటాయిస్తానని చంద్రబాబు ప్రకటించారన్నారు. కానీ దీన్ని 10 శాతం కుదించి మద్యం సిండికేట్లకు దక్కేలా చేశారని ఆరోపించారు.