మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. 16వ వార్డు ఆవా వాంబే గృహ సముదాయాల వద్ద శనివారం ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’లో భాగంగా చేపట్టిన బీట్ ద హీట్ కార్యక్రమంలో జేసీ ఎస్ చిన్నరాముడు, ఎమ్మెల్సీ సోమువీర్రాజుతో కలసి ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నగరంలో పటిష్టంగా అమలుపరుస్తున్నట్లు చెప్పారు.