దివాన్ చెరువు రిజర్వ్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయని కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం సాయంత్రం ప్రకటించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఆస్తి నష్టం జరగకుండా నివారించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. చక్రవద్వారబంధం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏ విధమైన భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.