రాజమండ్రి నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారిని ఎ. వినూత్న శుక్రవారం దానవాయిపేటలో జరుగుతున్న పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా శుభ్రత పనులను సమీక్షించి, శానిటేషన్ సిబ్బందికి తగు మార్గ నిర్దేశకాలు అందజేశారు. అలాగే దోమలు వృద్ధి చెందకుండా నివారించేందుకు షెడ్యూల్ ప్రకారం డ్రైనేజీలను శుభ్రం చేయంచాలని, ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చేసుకోవాలని సూచించారు.