రాజమండ్రి నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి ఎ. వినూత్న బుధవారం నగరంలోని పలు వార్డులలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా శుభ్రత పనులను సమీక్షించారు. అనంతరం మస్తరు కార్యాలయాలను తనిఖీ చేసి సిబ్బంది యొక్క అటెండెన్స్ ను పరిశీలించారు. అవసరమైన వారికీ మాత్రమే సెలవులు మంజూరు చేయాలని, ఎక్కువగా గైర్హాజరైన సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కి సూచించారు.