విజయవాడలో 5వ తేదీన నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువులందరూ ఐక్యతతో దేవాలయాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.