'స్వతంత్ర జనతా పార్టీ' అనుబంధ విద్యార్థి సంఘంగా 'స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్' ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ చీఫ్ బర్రే ఆనంద్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకై ఈ విద్యార్థి సంఘం పనిచేయబోతుందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పాటుపడతామని అన్నారు.