పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలిపి, వీరత్వానికి, మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని చాటి చెప్పడం జరిగిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు 17న నగరంలో తిరంగ యాత్ర దేశ భక్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు.