రాజమండ్రి నగరంలోని నారాయణపురం గోపాల్ నగర్ పుంతరోడ్డులో ఉన్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన కనకదుర్గమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.