ఉమ్మడి తూ. గో జిల్లాలో మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత బుధవారం రాజమండ్రిలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థతో పాటు మండల స్థాయి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 15 చోట్ల లోక్ అదాలత్ లు ఏర్పాటు చేశామని వివరించారు. కక్షిదారులు కేసులు రాజీ చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.