పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రి నగరంలోని జేఎన్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ కాలనీ పార్కు అభివృద్ధికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కులలో మౌలిక వసతులు కల్పిస్తూ, గ్రీన్‌రీని పెంచే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.