ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా వచ్చిన అర్జీలపై యాక్షన్ టేకెన్ రిపోర్టు సిద్ధం చేయవలసిందిగా ఆదేశించారు.