అనధికారికంగా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములలో అభ్యతరం లేని నివాస స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తూ. గో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధించి నివాస గృహాల ద్వారా అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిపై అనధికార ఆక్రమణల క్రమబద్ధీకరణ పథకం 2025 జీవో నెం. 30 ద్వారా రెవిన్యూ శాఖ తీసుకుని రావడం జరిగిందన్నారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి రావడం జరిగిందన్నారు.