రాజమండ్రిలోని రాజమహేంద్రి మహిళా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే 193వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ముందుగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ టి. కే. విశ్వేశ్వర రెడ్డి, కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి ఫూలే అట్టడుగు వర్గాలు, మహిళల హక్కుల కోసం పోరాడిన యోధురాలని కొనియాడారు.