రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనం పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని డిఆర్ఓ టి. సీతారామ మూర్తి అన్నారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద బీట్ ద హీట్ థీమ్ కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ప్రజలు ఎండల తీవ్రతకు గురికాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.