రాబోవు సంక్రాంతి సందర్భంగా ఎవరు కూడా ఎటువంటి జూద క్రీడలు నిర్వహించవద్దు, ప్రోత్సహించవద్దని తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదివారం సూచించారు. కోడిపందాలు, జూదం, గుండాటలు మరియు ఇతర నిషేధిత ఆటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత ఆటలను ఆడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలలో జిల్లా అంతట వాటిని నిరోధించడానికి పోలిసువారి ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.