ఎన్నికల ముందు అధికారం చేపట్టేందుకు సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇచ్చిన ఇతర హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తానని ఇచ్చిన హామీ ఎప్పటి వరకు నెరవేర్చలేదంటూ ధ్వజమెత్తారు.