రాజమండ్రిలో మంగళవారం నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం. వినీష తెలిపారు. రామదాసుపేట ఏరియాలో నాటుసారా అమ్మకాలపై దాడులు జరిపి పాత నేరస్థురాలైన దుప్పాడ లక్ష్మీ ఎలియాస్ క్వారీలక్ష్మీని అదుపులోకి తీసుకున్నామన్నారు. 75 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.