ఈ నెల 12 నుంచి రాజమండ్రిలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ద్వారా రైతులకు పొగాకు విత్తనాలను విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎం. శేషుమాధవ్ మంగళవారం తెలిపారు. 12 నుంచి సీటీఆర్‌ఐలోనూ, 22న కందుకూరు కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ పరిశోధనా స్థానంలో ప్రారంభమవుతాయన్నారు. టీబీజీఆర్ పాస్‌బుక్ కలిగిన రైతులకు కిలో రూ. 1200కి, పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన వారికి రూ. 1800కి విక్రయిస్తామన్నారు.