స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రాజమండ్రిలోని 10వ వార్డుకు చెందిన పలువురి పారిశుధ్య పరిశుద్ధ కార్మికులను శానిటరీ ఇన్స్పెక్టర్ బుధవారం శాలువా కప్పి సత్కరించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా నగరపాలక సంస్థ పారిశుధ్య పనులలో అద్భుతమైన ప్రదర్శన చూపిన వారిని ప్రోత్సహించడం, వారి కృషిని గుర్తించడం జరుగుతుందన్నారు. అలాగే ఇతర పారిశుధ్య కార్మికులకు కూడా మరింత సమర్థంగా పనులు చేయడానికి ఉత్తేజపరుస్తాయన్నారు.