ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజమండ్రి నగరంలో వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు నగర కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. మంగళవారం రాజమండ్రిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో అధికారుల నియామకంపై చర్చించారు. సంక్షేమ, అభివృద్ధి పనులు పర్యవేక్షణ, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు తెలిపారు.