జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా క్లీన్ గోదావరి పేరుతో బుధవారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో ఉన్న చెత్తను తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు.