విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం కడియం మండలంలోని వేమగిరి విద్యుత్ సబ్-స్టేషన్ పరిదిలోని జేగురుపాడు ఫీడర్ కు ఈనెల 7వ తేదీన (శుక్రవారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ దాట్ల శ్రీధర్ వర్మ బుధవారం తెలిపారు. కావున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కడియం, జేగురుపాడు, కడియపుసావరం గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారుడు గమనించాలని సూచించారు.