కడియం మండలం దుళ్ళలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 12 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి లక్ష్మణాచార్యులు బుధవారం తెలిపారు. 6న స్వామివారి శేష వాహన సేవ, 8న శ్రీవారి కళ్యాణం, గరుడవాహన సేవ, రథోత్సవం, 9న సుదర్శన హోమం 10న అన్నకుటోత్సవం, సదస్యం, 11న శ్రీ లక్ష్మీ హోమం 12న శ్రీ పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.