కడియం మండలం టీడీపీ అధ్యక్షులుగా మరో మారు కడియం ఉప సర్పంచ్ వెలుగుబంటి రఘురామ్ (నాని) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో కడియం మండల టీడీపీ అధ్యక్షులుగా కడియం గ్రామానికి చెందిన నాని ని నియమించారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.