ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, జనరల్ వార్డ్, పిల్లల వార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య, వైద్యేతర సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.