రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో కూటమి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రజలు దేశం కోసం సైన్యం-సైన్యం కోసం మనం అనే నినాదంతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. దవళేశ్వరం మెయిన్ రోడ్ మీదుగా ఈ ర్యాలీ విజయవంతంగా సాగింది. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉమ్మడి తూ. గో జిల్లా జనసేన పార్టీ మత్స్యకార విభాగం ఉపాధ్యక్షులు సికోటి శివాజీ, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.