జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసైనికులకు, వీర మహిళలకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదగా శనివారం సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఎవరైనా క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలిచి ఉంటుందన్నారు.