రాజమండ్రి టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతులమీదుగా అర్హులైన ఏడుగురు లబ్ధిదారులకు రూ. 12 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అర్హులైన వారు సీఎం సహాయనిధి కోసం మంజూరు చేసుకోవాలని సూచించారు.