రాజమండ్రి: ఆర్టీసీ బస్సు, కోళ్ల వ్యాన్ ఢీ

79చూసినవారు
రాజమండ్రిలోని ILTD జంక్షన్ గ్లోరిడై చర్చ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు, కోళ్ల వ్యాన్ ఎదురెదురుగా వెళ్తూ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోళ్ల వ్యాన్ బోల్తాపడగా ఆర్టీసీ బస్సు కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది. కాగా వ్యాన్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్