రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు జి. పి. ఆర్ హైస్కూల్ లో విద్యార్థులు ప్రవర్తన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాధ్, ఎస్ఐ రమేష్ పాల్గొని మాట్లాడారు. చదువు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో చెడు వ్యసనాలకు బానిస కామనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్స్ అఫిషియో మెంబర్ మత్సేటి శివ సత్య ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.